నూతన సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం | CJI Surya Kant Oath
CJI Surya Kant: భారతదేశ 53వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము న్యాయమూర్తిగా ఆయనను ప్రమాణం చేయించారు. ఆయన ఈ పదవిలో 2027 ఫిబ్రవరి 9 వరకు కొనసాగనున్నారు. సీజేఐ బాధ్యతలు చేపడుతున్న తొలి హరియాణా వాసిగా జస్టిస్ సూర్యకాంత్(Justice Surya Kant) ప్రత్యేక గుర్తింపు పొందారు. 1962 ఫిబ్రవరి 10న హరియాణాలోని హిస్సార్ జిల్లాలో జన్మించిన సూర్యకాంత్ న్యాయ రంగంలో విశిష్ట సేవలు అందించారు. పంజాబ్–హరియాణా…
