Chandrababu Naidu:మార్చి లోపు 5.8 లక్షల ఇళ్ల పూర్తి చేయాలని సీఎం ఆదేశం
అన్నమయ్య జిల్లా(ANNAMAYYA DIST) రాయచోటి నియోజకవర్గంలోని చిన్నమండెం ప్రాంతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CBN) సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజావేదిక సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇళ్ల నిర్మాణాలు(housing projects), నీటి సంరక్షణ చర్యలకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. ఇళ్లలో వినియోగించే విద్యుత్ ఉపకరణాల ప్రదర్శనను కూడా సమీక్షించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రూ.5,700 విలువైన నాలుగు బల్బులు, రెండు ట్యూబ్ లైట్లు, రెండు ఫ్యాన్లు అందిస్తున్నట్లు అధికారులు వివరించగా, మిగతా వర్గాల పేదలకు…
