ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్ర సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్
ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్ర సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్.బీజాపూర్ జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి పోలీసులు, నక్సలైట్ల మధ్య తీవ్ర ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. నేషనల్ పార్క్ పరిసర ప్రాంతాల్లో రెండు వైపులా కాల్పులు మోత మోగించాయి. ఈ ఘటనలో పలువురు నక్సలైట్లు మృతిచెందినట్లు ప్రాథమిక సమాచారం అందింది. భద్రతా దళాలు ఒక ప్రముఖ నక్సలైట్ నాయకుడిని చుట్టుముట్టినట్లు సమాచారం. బీజాపూర్ జిల్లా ఎస్పీ డాక్టర్ జితేంద్ర యాదవ్ ఈ ఎన్‌కౌంటర్‌ను ధృవీకరించారు. బీజాపూర్–గడ్చిరోలీ సరిహద్దు ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతోందని ఆయన తెలిపారు….
