Saturday, March 21, 2026
Google search engine
HomeInterNationalT20 World Cup 2026 | ప్రపంచకప్ ముందు ఆస్ట్రేలియా ప్లేయర్స్ ను వెంటాడుతున్న గాయాలు

T20 World Cup 2026 | ప్రపంచకప్ ముందు ఆస్ట్రేలియా ప్లేయర్స్ ను వెంటాడుతున్న గాయాలు

-

Google search engine

T20 World Cup 2026 కు సన్నాహాలు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో “ఆస్ట్రేలియా క్రికెట్” 15 మంది సభ్యులతో కూడిన జట్టును అధికారికంగా ప్రకటించింది. మిచెల్ మార్ష్ కెప్టెన్‌(Mitchell Marsh)గా కొనసాగుతుండగా, ఈసారి జట్టులో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.

ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు “ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్” గాయంతో ప్రపంచకప్ నుంచి దూరమయ్యారు. ప్యాట్ కమిన్స్‌కు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించిన క్రికెట్ ఆస్ట్రేలియా, అతని స్థానంలో “బెన్ డ్వార్షుయిస్”ను జట్టులో చేర్చింది.

మిగిలిన ఆటగాళ్లు: “ట్రావిస్ హెడ్, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, జేవియర్ బార్ట్‌లెట్, మ్యాట్ కొన్నోల్లీ, టిమ్ డేవిడ్, కామెరూన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా”. కెప్టెన్ మిచెల్ మార్ష్ నేతృత్వంలో, ఆస్ట్రేలియా జట్టు ఈసారి కూడా ట్రోఫీపై కన్నేసేందుకు పటిష్టంగా సన్నద్ధమవుతోంది.

కమిన్స్, స్టార్క్ లాంటి అనుభవజ్ఞుల లేమి జట్టుకు సవాలు అయినప్పటికీ, ఆసీస్ బ్యాటింగ్, ఆల్‌రౌండింగ్ విభాగాలు ఈ అంతరాన్ని భర్తీ చేస్తాయా అనేది క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

also read:School Aadhaar update | ఆధార్ సెంటర్లకు వెళ్లాల్సిన పనిలేదు.. స్కూల్‌ల్లోనే ఉచిత అప్డేట్స్

- Advertisement -
Google search engine
- Advertisment -
Google search engine

Must Read

telangana high court hearing plea challenging speaker decision on danam nagender disqualification case

Danam Nagender | హైకోర్టులో ఎమ్మెల్యే దానం పార్టీ ఫిరాయింపు కేసు…స్పీకర్ నిర్ణయానికి సవాల్

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వివాదం ఇప్పుడు తెలంగాణ హైకోర్టు వరకు చేరడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. దానం నాగేందర్ పార్టీ మారలేదని తెలంగాణ అసెంబ్లీ...
- Advertisement -
Google search engine