భారత యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌పై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గిల్‌ను సెలెక్టర్లు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారని, అతను పునరావృతంగా విఫలమవుతున్నా జట్టులో చోటు కల్పించడం అన్యాయం అని విమర్శించారు.
తాజాగా జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గిల్ మొత్తం 5 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 93 పరుగులు మాత్రమే చేశాడని శ్రీకాంత్ పేర్కొన్నారు. గిల్‌ను ఓవర్ రేటెడ్ క్రికెటర్‌గా అభివర్ణిస్తూ, ప్రతిభ కలిగిన ఇతర యువ క్రికెటర్లకు అవకాశాలు దూరమవుతున్నాయన్నారు.
శ్రీకాంత్ మాట్లాడుతూ, ఆటలో స్థిరత్వం లేదు కానీ అతడికి సెలెక్టర్లు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు అని తెలిపారు. యువ ఆటగాళ్లను ఎంపికలో పక్కన పెట్టడమే కాకుండా, గిల్‌పై ఇంత నమ్మకం పెట్టుకోవడం అనవసరం అని అభిప్రాయపడ్డారు.
ఇకపై గిల్ వంటి ఆటగాళ్లను జట్టులోకి తీసుకునే ముందు వారి ప్రదర్శనను క్షుణ్ణంగా సమీక్షించాల్సిన అవసరం ఉందని శ్రీకాంత్ సూచించారు. భారత జట్టు ఎంపికలో సమర్థత అవసరమని ఆయన వ్యాఖ్యానించారు.