పార్వతీపురం మన్యం జిల్లా, గుమ్మలక్ష్మీపురం మండలం, గొయిపాక పంచాయతీ కేంద్రంలో కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఆధ్వర్యంలో “ప్రత్యేక ప్రజా దర్బార్” కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ ప్రజా దర్బార్ కార్యక్రమం వలన ప్రజలు నేరుగా తమ సమస్యలను ప్రజాప్రతినిధులకు చెప్పుకోవచ్చని, వీలైనంతవరకు తమ దృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరిస్తున్నామని అన్నారు. ఈ ప్రజా దర్బార్ లో ఎక్కువగా హౌసింగ్, పెన్షన్లు, రిటర్నింగ్ వాల్, మొదలగు వాటి గురించి వినతులు ఎక్కువగా వచ్చాయి. అంగన్వాడి సెంటర్స్ మంజూరు చేయాలని కొన్ని గ్రామాల ప్రజలు వినతిపత్రం ఇచ్చారు. వాటికి సంబంధిత అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తానని అన్నారు. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి గొయిపాక, బీరుపాడు, చిన్నగీసాడ, జర్న గ్రామపంచాయతీ ప్రజలు వచ్చి వారి వినతులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో డి.డబ్ల్యు.ఎం.ఏ జై.ఈ శేషగిరి, పశువైద్యాధికారి లక్ష్మణ్, పంచాయతీరాజ్ ఏ.ఈ కె మురళీధర్, ఆర్.డబ్ల్యు.ఎస్ ఏ.ఈ ప్రవీణ్, హౌసింగ్ నుండి రమేష్, విద్యాశాఖ నుండి వెంకటరావు, ట్రైబల్ వెల్ఫేర్ నుండి రవి బాబు, ఐ.సి.డి.ఎస్ సిడిపిఓ సుశీల దేవి, సూపర్వైజర్ ఈశ్వరమ్మ, మండల పార్టీ అధ్యక్షులు పాడి సుదర్శన్రావు, స్థానిక సర్పంచ్ కె.లక్ష్మి, నాయకులు సుందర్ రావు, రమేష్, శరత్, అనీష్, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
గొయిపాకలో ప్రత్యేక ప్రజా దర్బార్ కార్యక్రమం
