Sonu Sood Indigo Staff Support | ఇండిగో సిబ్బందికి మద్దతు ఇవ్వండి: సోనూసూద్ 

Sonu Sood urges passengers to support Indigo airline staff during delays Sonu Sood urges passengers to support Indigo airline staff during delays

Sonu Sood: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో (indigo airlines)సేవల్లో అంతరాయం ఏర్పడి, ప్రయాణికుల ప్రయాణాల్లో ఆలస్యం చోటుచేసుకుంటోంది. దాంతో పలు ఎయిర్‌పోర్టులలో ప్రయాణికులు సిబ్బందిపై అసహనం వ్యక్తం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు సోనూసూద్ స్పందించారు. ఎక్స్ వేదిక ద్వారా వీడియోను విడుదల చేసిన ఆయన, బాధ్యతతో వ్యవహరించాలని ప్రజలను కోరారు.

ALSO READ:Google Year Ender 2025 | 2025లో ఎక్కువగా వెతికినవి ఇవే టాప్ లో IPL 

విమానాల ఆలస్యం అసహనం కలిగించవచ్చని ఆయన అంగీకరిస్తూ, సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్న సిబ్బందిపై ఒత్తిడి పెంచడం సముచితం కాదన్నారు. రద్దుల ప్రభావం వారికి కూడా ఉందని గుర్తుచేసారు.

కష్ట సమయంలో వారిని గౌరవంగా చూడటం అవసరమని సోనూసూద్ వ్యాఖ్యానించారు. ప్రయాణికులకు మద్దతుగా ఉండి, సిబ్బందిపై కోపం చూపకూడదనే సందేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *