Social Media Ban: ఆస్ట్రేలియా ప్రభుత్వం చిన్నారుల ఆన్‌లైన్ భద్రతను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లలు ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌నూ వాడకుండా నిషేధించే కొత్త నిబంధనలను అమలు చేసింది.
ఈ నిర్ణయంతో వయస్సు పరిమితిని చట్టంగా అమలు చేసిన ప్రపంచంలోని తొలి దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది.
ALSO READ:Telangana Transport | ప్రయాణికులకు గుడ్ న్యూస్….కొత్తగా ప్రారంభించిన EV బస్సులు..
ఇకపై టిక్‌టాక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌తో పాటు అన్ని ప్రధాన సామాజిక మాధ్యమాలు 16 ఏళ్ల లోపు యూజర్లను అనుమతించకూడదు. వయస్సు నిర్ధారణకు కఠినమైన వెరిఫికేషన్ విధానాలు తప్పనిసరుచేసింది.
నిబంధనలు ఉల్లంఘించిన కంపెనీలకు 33 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల వరకు భారీ జరిమానాలు విధించే అవకాశం ఉంది.
పిల్లల్లో పెరుగుతున్న వ్యసనం, ఆన్‌లైన్ బుల్లీయింగ్, ప్రైవసీ సమస్యలు, మానసిక ఆరోగ్యంపై ప్రభావం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. ఈ చర్యను ప్రపంచవ్యాప్తంగా చర్చిస్తున్నారు.
