తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో క్రేజ్ ఉన్న సాయిపల్లవి, నటన ప్రధానమైన పాత్రలు ఎంచుకుంటూ, ప్రేక్షకుల అభిమానాన్ని అందుకుంటుంది. ఆమె తన సినిమాల్లో పాత్రలన్నీ నిజ జీవితానికి దగ్గరగా ఉండేలా ఎంచుకుంటుంది. డాన్స్‌లో తన ప్రతిభను చాటుకుంటూ నటనలోనూ ప్రత్యేకతను సృష్టిస్తోంది. కథ, పాత్ర నచ్చితేనే సినిమా చేయడం వల్ల సాయిపల్లవి కెరీర్లో ఎక్కువగా విజయాలు సాధిస్తున్నాయి.
ఇటీవల సాయిపల్లవి నటించిన చిత్రం అమరన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఈ చిత్రం మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితకథ ఆధారంగా రూపొందింది. అక్టోబర్ 31న విడుదలైన ఈ చిత్రం, ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించి సక్సెస్ ఫుల్ చిత్రంగా నిలిచింది. సినిమాలో సాయిపల్లవి నటనకు మంచి మార్కులు పడటం, ఆమె అభిమానులను మరింత ఆకర్షించింది.
ప్రస్తుతం సాయిపల్లవి తెలుగులో చైతూ జోడీగా నటించిన తండేల్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కాబోతోంది. శ్రీకాకుళానికి చెందిన జాలరి జీవితాన్ని ప్రేమ, దేశభక్తి నేపథ్యంలో చూపించే ఈ కథ, అభిమానుల్లో భారీ ఆసక్తి రేపుతోంది.
