90వ దశకంలో టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపిన అందగత్తె రంభ, తన నటనతో, అందచందాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అగ్ర హీరోలందరి సరసన నటించి, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. బాలీవుడ్‌లోనూ మెరిసిన రంభ, ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది.
అప్పటి తరం అభిమానులకు రంభ ఇప్పటికీ ప్రియమైన నటి. తన గ్లామర్, నటనతో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆమె, ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. రీఎంట్రీపై స్పందించిన రంభ, సినిమా తన తొలి ప్రేమ అని, మళ్లీ వెండితెరపై మెరవాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పింది.
ఇప్పుడున్న కథానాయికలతో పోటీగా తాను కాకుండా, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలనుకుంటున్నట్లు తెలిపింది. పర్ఫామెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్ చేస్తూ, తన అనుభవాన్ని ఉపయోగించుకుంటానని పేర్కొంది. మంచి కథలు వస్తే ఎలాంటి పాత్రకైనా సిద్దమని చెప్పిన రంభ, త్వరలోనే తన కొత్త ప్రాజెక్ట్ ప్రకటించనుందని సమాచారం.
రంభ రీఎంట్రీ గురించి అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆమె ఏ రకమైన పాత్రలు చేస్తుందో చూడాలి. ప్రేక్షకుల మనసు దోచిన రంభ, మళ్లీ టాలీవుడ్‌లో తన సత్తా చాటుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
