మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమాలో నుంచి “రామ రామ” అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ ఇటీవలే విడుదల చేశారు. ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతం అందించిన ఈ పాటకు రామజోగయ్యశాస్త్రి అద్భుతమైన లిరిక్స్ రాశారు. శంకర్ మహాదేవన్, లిప్సికా గాత్రం పాటకు మరింత ఆకర్షణగా నిలిచింది.
ఈ పాటలో శ్రీరాముని మహిమను పొగడ్తలతో వివరించారు. చక్కటి సంగీతం, అద్భుతమైన గాత్రంతో పాట శ్రోతల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. చిరంజీవి తనదైన స్టైల్లో పాటపై డ్యాన్స్ చేస్తూ కనిపించడం వీడియోలో ప్రత్యేకంగా నిలిచింది. ఈ పాట సినిమాకే ఓ ప్రధాన ఆకర్షణగా మారనుందని అభిమానులు భావిస్తున్నారు.
వంశీ, ప్రమోద్ విక్రమ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతం అందించడంతో పాటే కాదు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పైనా భారీ అంచనాలు నెలకొన్నాయి. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో త్రిష, ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా విడుదలైన “రామ రామ” పాట ఈ ప్రాజెక్టుపై ఉన్న అంచనాలను మరింతగా పెంచింది. మ్యూజికల్ హిట్‌గా మారే అవకాశమున్న ఈ సాంగ్, సినిమా ప్రమోషన్‌లో కీలకంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమాపై ప్రేక్షకుల్లో ఉత్కంఠ మరింతగా పెరుగుతోంది.