తెలంగాణలో ఈ నెల 6వ తేదీ నుంచి ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే పనిచేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పరిమితి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలకు వర్తించనుంది. టీచర్లు మూడు వారాలపాటు కుల గణనలో పాల్గొననున్నందున ప్రాథమిక పాఠశాలలు మధ్యాహ్నం వరకే నిర్వహించాలని నిర్ణయించింది. అయితే, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం యథావిధిగా అందజేయాలని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది.
ప్రస్తుత సర్వేలో ప్రాథమిక పాఠశాలల 36,559 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు, 3,414 మంది ప్రధానోపాధ్యాయుల సేవలను వినియోగించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే, ప్రభుత్వ, ఎంపీపీ, జడ్‌పీపీ, ఎయిడెడ్ స్కూళ్ల నుంచి 2 వేల మంది మినిస్టీరియల్ సిబ్బంది సర్వేలో పాల్గొంటారు. సర్వే నిర్వహణలో బోధనేతర సిబ్బంది కూడా పాల్గొంటారని అధికారులు పేర్కొన్నారు.
ప్రణాళిక విభాగం ఆదేశాల మేరకు సెకండరీ గ్రేడ్ టీచర్లు సెలవు దినాల్లోనూ ఎన్యుమరేటర్ విధుల్లో పాల్గొనాల్సి ఉంటుంది. అయితే, హైస్కూళ్లలో విధులు నిర్వర్తిస్తున్న ఎస్‌జీటీలను ఈ విధుల నుంచి మినహాయించనందున, హైస్కూల్ పాఠశాలలు యథావిధిగా………….








