ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం కువైట్కు బయల్దేరారు. ఈ పర్యటనకు ఆ దేశ చక్రవర్తి షేక్ మెహ్ల్ ఆహ్వానం తెలిపారు. 1981లో ఇందిరా గాంధీ తర్వాత కువైట్కు పర్యటించిన భారత ప్రధాని మోదీయే కావడం విశేషంగా చెప్పవచ్చు. 43 ఏళ్ల తర్వాత భారత ప్రధాన మంత్రి కువైటుకు వెళ్లడం ఒక చరిత్రాత్మక ఘటనగా భావిస్తున్నారు.
మోదీ పర్యటన సందర్భంగా రెండు దేశాలు దౌత్య సంబంధాల బలోపేతం, వాణిజ్యం, పెట్టుబడులు, ఎనర్జీ, డిఫెన్స్ సహకారం వంటి వివిధ రంగాలలో ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి. ఈ పర్యటన రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలు నెలకొల్పడంలో కీలకంగా మారనుంది.
మోదీ ఈ పర్యటనలో కువైట్‌లోని నాయకులతో వాణిజ్య, భద్రత, శక్తి రంగాలపై చర్చలు జరుపనున్నారు. ఈ ఒప్పందాలు భారతదేశానికి పెట్టుబడులు, వాణిజ్య అవకాశాలు మరియు రక్షణ రంగంలో అనేక కీలక ప్రయోజనాలను తీసుకురావడం ఖాయమని భావిస్తున్నారు.
ఈ పర్యటన ద్వారా కువైటు మరియు భారతదేశం మధ్య సంబంధాలు మరింత బలపడనున్నాయి. దేశాల మధ్య అనుబంధాలు, వ్యాపార సంబంధాలు, మరియు విదేశీ పెట్టుబడుల పరంగా కొత్త ఒప్పందాలు జరగనున్నాయి.