జీ 20 సదస్సులో ప్రధాని మోదీ, విదేశీ నేతలతో చర్చలు

PM Modi met with world leaders at the G20 summit in Rio de Janeiro, discussing key areas like space, energy, AI, and trade. PM Modi met with world leaders at the G20 summit in Rio de Janeiro, discussing key areas like space, energy, AI, and trade.

బ్రెజిల్‌లోని రియో డి జనిరోలో జరుగుతున్న జీ 20 సదస్సులో (G20 Summit) భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పాల్గొన్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే ఆయన పలువురు దేశాధినేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ ( Emmanuel Macron)తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ‘నా స్నేహితుడు, అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ను కలవడం ఎంతో సంతోషంగా ఉంది. భారత్‌, ఫ్రాన్స్‌లు అంతరిక్షం, ఇంధనం, ఏఐ వంటి ఇతర రంగాలలో సన్నిహితంగా పనిచేయడంపై చర్చించాం. ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాలను బలపరిచేందుకు పనిచేస్తాం’ అని మోదీ ఎక్స్‌ వేదికగా తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో పారిస్‌ వేదికగా జరిగిన ఒలింపిక్స్‌ను సమర్థంగా నిర్వహించారని మెక్రాన్‌ను ప్రశంసించినట్లు మోదీ వెల్లడించారు. ఈ సమావేశం భారత్‌- ఫ్రాన్స్‌ వ్యూహాత్మక భాగస్వామ్యంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అభివర్ణించింది.

బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ (Keir Starmer)తోను మోదీ చర్చించారు. ‘రాబోయే కాలంలో సాంకేతికత, గ్రీన్‌ఎనర్జీ, భద్రత, ఆవిష్కరణ వంటి రంగాల్లో బ్రిటన్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నాం. వాణిజ్యంతో పాటు సాంస్కృతిక సంబంధాలను సైతం బలపరచాలనుకుంటున్నాం’ అని మోదీ తెలిపారు. మరోవైపు ఇటలీ, యూకే, ఇండోనేషియా, నార్వే, పోర్చుగల్‌తో సహా పలు దేశాధినేతలతోను మోదీ సమావేశమయ్యారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *