Peddi Release Date: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ రిలీజ్ డేట్‌పై గందరగోళం కొనసాగుతోంది. మొదట ఏప్రిల్ 30న రిలీజ్ చేయాలని ప్రకటించినప్పటికీ, తాజాగా పరిస్థితులు చూసి వాయిదా పడ్డట్లేనని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నారు.
నిర్మాత, చిత్ర యూనిట్ వివిధ కారణాలతో జూన్ 4 లేదా జూన్ 24ను పరిశీలిస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
హైదరాబాద్‌లో షూటింగ్ వేగంగా జరుగుతూ, రామ్ చరణ్ ముఖ్య సన్నివేశాల్లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, శివరాజ్ కుమార్, జగపతి బాబు, ‘మిర్జాపూర్’ ఫేమ్ దివ్యేంద్ర శర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
సంగీతం ఏఆర్ రెహ్మాన్ అందిస్తున్న ఈ సినిమా ఇప్పటికే విడుదలైన పాటలతో మంచి స్పందన పొందింది. అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ డేట్ క్లారిటీ తర్వాత ప్రమోషన్స్ వేగంగా కొనసాగే అవకాశముంది.








