Saturday, March 21, 2026
Google search engine
HomeFilms Newsఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఫస్ట్ స్టిల్ విడుదల...పవర్ స్టార్ హ్యాండ్ రైజ్ స్టిల్ వైరల్

ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఫస్ట్ స్టిల్ విడుదల…పవర్ స్టార్ హ్యాండ్ రైజ్ స్టిల్ వైరల్

-

Google search engine

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ “ఉస్తాద్ భగత్ సింగ్” టాలీవుడ్‌లో భారీ అంచనాలను సృష్టిస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘దేఖ్ లేంగే సాలా’ పాటకు మంచి స్పందన లభించగా, తాజాగా మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ స్టిల్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ స్టిల్‌లో పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్‌తో పాటు టీమ్ మొత్తం అభిమానుల కోసం ఉత్సాహంగా ‘హ్యాండ్ రైజ్’ చేస్తూ కనిపించారు.

ఈ సందర్భంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ, “ఆనందంతో మీ చేతులను పైకెత్తి మా ఉస్తాద్ భగత్ సింగ్‌కు చీర్స్ చెప్పండి” అంటూ అభిమానుల్లో హైప్ పెంచారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కల్ట్ డైరెక్టర్ హరీష్ శంకర్ కలయికలో ఈ సినిమా భారీ ఫీస్ట్‌గా ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ తెలిపారు.

ఫస్ట్ స్టిల్ రిలీజ్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. షూటింగ్, మ్యూజిక్, ప్రమోషన్ల పరంగా మంచి బజ్ సంపాదించిన ఈ మూవీ 2026లో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా థియేటర్లలో సందడి చేయనుంది.

ALSO READ:ఈ ఏడాది పద్మ అవార్డుల్లో మెరిసిన క్రీడాకారులు ఎవరో తెలుసా?

- Advertisement -
Google search engine
- Advertisment -
Google search engine

Must Read

telangana high court hearing plea challenging speaker decision on danam nagender disqualification case

Danam Nagender | హైకోర్టులో ఎమ్మెల్యే దానం పార్టీ ఫిరాయింపు కేసు…స్పీకర్ నిర్ణయానికి సవాల్

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వివాదం ఇప్పుడు తెలంగాణ హైకోర్టు వరకు చేరడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. దానం నాగేందర్ పార్టీ మారలేదని తెలంగాణ అసెంబ్లీ...
- Advertisement -
Google search engine