Tuesday, March 17, 2026
No menu items!
Home InterNational Pakistan airstrike | కాబూల్ ఆసుపత్రిపై పాక్ వైమానిక దాడి – దాదాపు 400 మంది...

Pakistan airstrike | కాబూల్ ఆసుపత్రిపై పాక్ వైమానిక దాడి – దాదాపు 400 మంది మృ**తి

0
7
Damaged hospital in Kabul after Pakistan airstrike, smoke rising, rescue teams at work.
Damaged hospital in Kabul after Pakistan airstrike, smoke rising, rescue teams at work.

Pakistan airstrike: పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా, కాబూల్‌లోని ఓ ఆసుపత్రిపై పాక్‌(Kabul hospital) వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో అఫ్గాన్‌ అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటివరకు 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు, దాదాపు 250 మంది గాయపడ్డారు. ఆసుపత్రిలో మంటలు విస్తరించడంతో, రక్షణా బృందాలు అవి అదుపులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. భవనం పూర్తిగా ధ్వంసం కావడంతో, శిథిలాల కింద ఉన్న మృతదేహాలను వెలికితీస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ దాడిని తక్షణమే పాక్‌ ప్రభుత్వం పై వస్తున్న ఆరోపణలను ఖండించింది. అఫ్గాన్‌ పోలీస్‌, పౌరులపై దాడి లేనని, వారు చేసిన ఆపరేషన్‌లో కేవలం సైనిక స్థావరాలు మరియు ఉగ్రవాద మౌలిక సదుపాయాలను మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పాక్‌ సమాచార మంత్రిత్వశాఖ వెల్లడించింది. పౌరుల ఆస్తులకు ఎలాంటి నష్టంజరగలేదని, ఈ ఆపరేషన్‌ నియంత్రితంగా నిర్వహించబడిందని పేర్కొంది.

ఈ ఘటన పాక్-అఫ్గాన్‌ సరిహద్దు ప్రాంతంలో భద్రతా పరిస్థితులను మరింత ఉద్రిక్తతకు తీసుకెళ్ళే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ కమ్యూనిటీ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, శాంతి కోసం మద్యవర్తి చర్యలు తీసుకోవాలని కోరుతోంది.

YouTube thumbnailYouTube icon