Oppo F33 Pro 5g: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఒప్పో మరోసారి వినియోగదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. ఒప్పో F33 సిరీస్‌ను ఏప్రిల్ 15న విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ సిరీస్‌లో ఒప్పో F33, ఒప్పో F33 ప్రో 5G మోడళ్లు అందుబాటులోకి రానున్నాయి.
ఇప్పటికే ఈ ఫోన్లకు సంబంధించిన కీలక ఫీచర్లు, డిజైన్ వివరాలు లీక్ కావడంతో వినియోగదారుల్లో ఆసక్తి పెరిగింది.
ఈ ఫోన్లు మిస్టీ ఫారెస్ట్, స్టార్రీ బ్లూ, ప్యాషన్ రెడ్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో విడుదల కానున్నాయి. కెమెరా విషయంలో ఒప్పో F33 సిరీస్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 50MP ప్రైమరీ రియర్ కెమెరాతో పాటు 2MP డెప్త్ సెన్సార్ అందించనున్నారు.
ఇక F33 ప్రో 5Gలో 100 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 50MP అల్ట్రావైడ్ ఫ్రంట్ కెమెరా ఉండనుంది. ఇది డ్యూయల్ వ్యూ వీడియో, ఫ్రంట్ ఫిల్ లైట్ వంటి ఫీచర్లకు సపోర్ట్ చేస్తుంది.
కెమెరాలో AI పోర్ట్రెయిట్ గ్లో, నాచురల్ లైట్, స్టూడియో లైట్ వంటి అడ్వాన్స్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ ఆధారిత కలర్ ఓఎస్‌పై పనిచేస్తాయి. డిజైన్ పరంగా ఫ్లాట్ బ్యాక్, ఫ్లాట్ ఫ్రేమ్, రెక్టాంగ్యులర్ కెమెరా మాడ్యూల్‌తో స్టైలిష్ లుక్‌ను అందిస్తాయి.
అదనంగా, IP69K రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ కూడా లభించనుంది. మొత్తం మీద, ఈ సిరీస్ మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో మంచి పోటీని ఇవ్వనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ధర వివరాలు లాంచ్ రోజున అధికారికంగా ప్రకటించనున్నారు.








