Wednesday, April 8, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTసోషల్ మీడియాలో NTR Neel పుకార్లకు మైత్రీ క్లారిటీ

సోషల్ మీడియాలో NTR Neel పుకార్లకు మైత్రీ క్లారిటీ

-

Chat on WhatsApp

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘NTR Neel’ గురించి సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా సినిమా షూటింగ్ రద్దయిందంటూ, ఎన్టీఆర్ కొత్త లుక్‌పై సంతృప్తి లేకపోవడంతో షెడ్యూల్స్ నిలిపివేశారని వార్తలు చర్చనీయాంశమయ్యాయి.

అయితే, నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ స్పష్టం చేస్తూ ఈ పుకార్లకు ఎలాంటి వాస్తవం లేదని, షూటింగ్ రద్దు కాలేదని తెలియజేశారు. ప్రస్తుత గ్యాప్ కేవలం తదుపరి భారీ షెడ్యూల్ కోసం తీసుకున్న సన్నాహాలకే సంబంధించినదని చెప్పారు.

ఎన్టీఆర్ లుక్, షెడ్యూల్ భవిష్యత్తులో ఇప్పటికే అనుకున్న ప్లాన్ ప్రకారం సాగుతుందని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే జోర్డాన్‌లో కీలక షెడ్యూల్స్ పూర్తయిన ఈ మాస్ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్ యుద్ధ శిక్షణలు తీసుకుని, బాడీ లాంగ్వేజ్ మార్చుకుంటున్నారని సమాచారం.

కన్నడ నటి రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా, టాలీవుడ్, శాండల్‌వుడ్‌లో భారీ అంచనాల మధ్య తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర బృందం సిద్ధమవుతోంది.

సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మకూడదని, ఏదైనా సమాచారం అధికారికంగా ప్రకటిస్తామని మేకర్స్ విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

indian stock market rally with sensex and nifty surging after ceasefire optimism and crude oil price fall

Indian Stock Market | ముడి చమురు ధర పతనం, కాల్పుల విరమణ ఊరట… మార్కెట్లలో...

Indian Stock Market: ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ సంకేతాలు, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా క్షీణించడం దేశీయ స్టాక్ మార్కెట్లకు భారీ ఊపునిచ్చాయి. దీంతో బుధవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్, నిఫ్టీ...
- Advertisement -
Chat on WhatsApp