ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీ పై ఇందుకూరుపేట ఎక్సైజ్ సీఐ జీవీ ప్రసాద్ రెడ్డి గురువారం మీడియాకు దీనికి సంబంధించిన విషయాలను వివరించారు,
ఇందుకూరుపేట మండలంకు సంబంధించి 5 షాపులు, తోటపల్లి గూడూరు మండలంకు 5 షాపులు
ముత్తుకూరు మండలంకు 8 షాపులను,
మొత్తం మూడు మండలాలకు కలిపి 18 షాపులను కేటాయించినట్లు వారు తెలిపారు, ఈనెల1 తేదీ నుంచి 9వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్ ఆఫ్ లైన్ ద్వారా అప్లికేషన్లు స్వీకరిస్తామని తెలిపారు,
11వ తేదీ ఉదయం 8 గంటలకు లాటరీ పద్ధతిలో నిర్ణయించిన ప్రకారం ఎంపిక చేసి 12వ తేదీ నుంచి మద్యం షాపులు నిర్వహించుకోవచ్చు అని తెలిపారు. బడికి గుడికి దూరంగా ఈ షాపులు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని సిఐ ఈ సందర్భంగా తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ లో కొత్త మద్యం పాలసీ
