పార్వతీపురం మన్యం జిల్లా,జియమ్మవలస మండలం, టి.కె.జమ్ము గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ బోండి దుర్గమ్మ దసరా ఉత్సవాల్లో కురుపాం నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారికి ముందుగా గ్రామ ప్రజలు మేళా తాళాలు తో ఘనస్వాగతం పలికారు. అనంతరం శ్రీ బోండి దుర్గమ్మ కి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అడ్డాకుల సుందర్రావు, పి.టి.మండ మాజీ సర్పంచ్ చలపతిరావు, శంకర్ రావు, మన్మధ, శ్రీను, భారతమ్మ, బుజ్జి , కూటమి నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
శ్రీ బోండి దుర్గమ్మ దసరా ఉత్సవాల్లో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొనడం
