కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు పక్షపాతి ప్రభుత్వం నియోజకవర్గ అబివృద్దే నా ధ్యేయం. అనవసరమైన గ్రూపు రాజకీయాలు, తగాదాలతో అభివృద్ధి కుంటుపడుతుంది. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చే విధంగా ఎవరు వ్యవహరించకూడదు. పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయి.*
కొత్త, పాత అనే తేడా లేకుండా, నాయకత్వం కోసం పోటీ పడకుండా ప్రతి ఒక్కరు నియోజకవర్గ అభివృద్ధి కొరకు కృషి చేయాలి.
రఘునాథపల్లి మండలంలోని కంచనపల్లి గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం వ్యవసాయ రంగంతో పాటు అన్ని రంగాల్లో దూసుకుపోతుందన్నారు,సన్న రకాలకు 500 బోనస్ అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు పక్షపాతి ప్రభుత్వం అని అన్నారు. త్వరలోనే రైతులందరికీ రైతు భరోసాతో పాటు రైతు రుణమని ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు.