కామారెడ్డిలో మెగా రక్తదాన శిబిరం

A mega blood donation camp in Kamareddy, organized by local groups to help children with thalassemia, aims to raise awareness about the importance of blood donation. A mega blood donation camp in Kamareddy, organized by local groups to help children with thalassemia, aims to raise awareness about the importance of blood donation.

కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందూప్రియ చంద్రశేఖర్ రెడ్డి. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడాలనే మంచి ఉద్దేశంతో కామారెడ్డి రక్తదాతల సమూహం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) , ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీల ఆధ్వర్యంలో ఈ ఆదివారం జిల్లా కేంద్రంలోని కర్షక్ బి.ఎడ్ కళాశాలలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని ఈ రక్తదాన శిబిరానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న రక్తదాతలు వచ్చి రక్తదానం చేయాలని , రక్తం సకాలంలో దొరకకపోవడంతో చిన్నారులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని వారికి కావలసిన రక్తాన్ని అందజేయాల్సిన బాధ్యత సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి పైన ఉందని ,15 రోజులకు ఒక యూనిట్ రక్తము తలసేమియా చిన్నారులకు జీవితాంతం అవసరం ఉంటుందని కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రక్తదానం చేసిన రక్తదాతలను అభినందించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ , జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ లు రావడం జరుగుతుందని , యువత పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి రక్తదానం చేయాలని అన్నారు.రక్తదానం చేయాలనుకునే వారు మరిన్ని వివరాల కోసం 9492874006 నెంబర్ కి సంప్రదించాలని అన్నారు.
ఈ సమావేశంలో ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ , రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు , కౌన్సిలర్ పాత శివ కృష్ణమూర్తి , కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్ వేదప్రకాష్ , ప్రధాన కార్యదర్శి గంప ప్రసాద్ , ఉపాధ్యక్షులు జమీల్ హైమద్ , డాక్టర్ పుట్ల అనిల్ కుమార్ , సలహాదారులు ఎర్రం చంద్రశేఖర్ , వెంకటరమణలు , SRK డిగ్రీ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ దత్తాద్రి , రాజులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *