ఎల్పీయూ విద్యార్థులకు కోటిన్నర ప్యాకేజీలతో రికార్డ్ ప్లేస్‌మెంట్స్

LPU students achieved record placements with multi-crore salary packages, showcasing their exceptional talent. LPU students achieved record placements with multi-crore salary packages, showcasing their exceptional talent.

పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్‌పీయూ) బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు రికార్డు స్థాయి ప్లేస్‌మెంట్స్ సాధించారు. వార్షికంగా కోట్ల రూపాయల వేతనాలతో ఇద్దరు విద్యార్థులు ఉద్యోగాలు పొందటం విశేషం. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ) విద్యార్థి శ్రీ విష్ణు ప్రముఖ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కంపెనీలో రూ.2.5 కోట్ల భారీ ప్యాకేజీతో ఉద్యోగం పొందాడు. అదే విధంగా బేతిరెడ్డి నాగ వంశీ రెడ్డి రూ.1.03 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాడు.

ఈ ఏడాది ఎల్‌పీయూ నుంచి 1,700 మందికి పైగా విద్యార్థులు రూ.10 లక్షల నుంచి రూ.2.5 కోట్ల మధ్య వేతనాలతో ఉద్యోగ అవకాశాలు పొందారు. 1,912 మంది విద్యార్థులు ఒకటి కన్నా ఎక్కువ కంపెనీల నుంచి ఆఫర్లు పొందడం గమనార్హం. మైక్రోసాఫ్ట్, అమెజాన్, సిస్కో, పేపాల్, న్యూటానిక్స్, పాలో అల్టో నెట్‌వర్క్స్ వంటి ప్రతిష్టాత్మక బహుళజాతి కంపెనీలు ఈ విద్యార్థులను హైరింగ్ చేశాయి.

అంతేగాక, కోటి రూపాయల వేతనంతో ప్రవీణ్ కుంచల, రూ.63 లక్షల ప్యాకేజీతో ఎస్ అర్జున్, రూ.53 లక్షల జీతంతో అంజలి, రూ.51 లక్షల వార్షిక వేతనంతో నూకవరపు వంశి, నజియా పర్వీన్ ప్లేస్‌మెంట్ సాధించారు. ఇది విద్యార్థులకు, విద్యా సంస్థకు గర్వించదగిన ఘనతగా నిలిచింది.

ఎల్‌పీయూ ప్రతినిధులు ఈ విజయాన్ని ప్రస్తావిస్తూ, విద్యార్థులకు పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలను అందించడంలో విశేష కృషి చేసినట్లు తెలిపారు. అత్యుత్తమ కార్పొరేట్ కనెక్షన్లు, ప్లేస్‌మెంట్ ట్రైనింగ్ కారణంగా విద్యార్థులు భారీ వేతనాలతో ఉద్యోగాలు పొందుతున్నారని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *