రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మన్యం జిల్లా, కురుపాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు ప్రైవేట్ సంస్థల ప్రతినిధులు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించారు. 273 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరుకాగా అందులో 53 మంది ఎంపికైనట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సాయి కృష్ణ చైతన్య శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో తెలిపారు. యువతకు ఉపాధి కల్పనలో భాగంగా నిర్వహిస్తున్న జాబ్ మేళాలో యువత పాల్గొవాలని ఆయన సూచించారు.
కురుపాం కళాశాలలో జాబ్ మేళా నిర్వహణ
