
India Post: భారత తపాలా శాఖ సేవల నాణ్యతను పెంచడానికి మంగళవారం మూడు కొత్త ప్రీమియం డెలివరీ సేవలను ప్రారంభించింది. ఇందులో 24 గంటల స్పీడ్ పోస్ట్, 24 గంటల స్పీడ్ పోస్ట్ పార్శిల్, మరియు 48 గంటల(24 & 48-hour delivery) స్పీడ్ పోస్ట్ ఉన్నాయి
ఈ సేవలు ముఖ్యంగా అత్యవసర డాక్యుమెంట్లు, పార్శిళ్లు మరియు ఇతర సరుకులను 24 లేదా 48 గంటల్లో గమ్యస్థానానికి చేరవేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి “జ్యోతిరాదిత్య సింధియా” మరియు తపాలా శాఖ సహాయ మంత్రి “డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్” అధికారికంగా ప్రారంభించారు.
మొదటి దశలో ఈ సేవలు “ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్” వంటి ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉంటాయి. వినియోగదారులకు డెలివరీ సులభత కోసం “ఓటీపీ ఆధారిత డెలివరీ”, “ఎస్‌ఎమ్‌ఎస్ అలర్ట్స్”, పెద్ద బుకింగ్‌ల కోసం “ఉచిత పికప్”, జియో-ట్యాగింగ్, సెంట్రలైజ్డ్ బిల్లింగ్, మరియు ‘బై నౌ, పే లేటర్’ వంటి అనేక సౌకర్యాలు అందించనున్నారు.
డెలివరీలో ఆలస్యం జరిగితే వినియోగదారులు చెల్లించిన మొత్తాన్ని తిరిగి పొందుతారు. కేంద్ర మంత్రి వివరాల ప్రకారం, దేశంలోని ఈ-కామర్స్ మార్కెట్ విలువ ప్రస్తుతం సుమారు ₹11 లక్షల కోట్లు, 2030 నాటికి ₹30 లక్షల కోట్లకు చేరనుంది. కొత్త ప్రీమియం సేవలు తపాలా శాఖను ఆధునిక, వేగవంతమైన మరియు వినియోగదారులకు మరింత అనుకూలత కలిగించే దిశగా మలుపు మారుస్తాయి.





