Friday, February 20, 2026
spot_img
HomeTelanganaIndia AI Impact Summit | హైదరాబాద్‌ను గ్లోబల్ ఏఐ హబ్‌గా చేయడమే లక్ష్యం

India AI Impact Summit | హైదరాబాద్‌ను గ్లోబల్ ఏఐ హబ్‌గా చేయడమే లక్ష్యం

ఢిల్లీ లో నిర్వహించిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌(India AI Impact Summit)లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృత్రిమ మేధను మానవ చరిత్రలో అత్యంత గొప్ప ఆవిష్కరణగా పేర్కొన్నారు. ఇది వ్యవసాయం సహా పలు రంగాల్లో విప్లవాత్మక మార్పులు తేనుందని అన్నారు. దేశంలో ఏఐ అభివృద్ధి కోసం నీతి ఆయోగ్, జీఎస్టీ కౌన్సిల్(GST COUNCIL) తరహాలో జాతీయ ఏఐ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ప్రధాని మోడీని కోరారు. కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక ఏఐ మంత్రిత్వ శాఖ అవసరమని నొక్కిచెప్పారు.

తెలంగాణ ఇప్పటికే ఏఐ స్టార్టప్‌లలో ముందంజలో ఉందని, కేంద్ర మద్దతుతో హైదరాబాద్‌లో భారీ ఏఐ వార్ రూమ్ ఏర్పాటు చేయడానికి సిద్ధమని వెల్లడించారు. గూగుల్, ట్విట్టర్, వాట్సాప్ వంటి సంస్థల్లో భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, మన దేశం నుంచి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు రావాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణను గ్లోబల్ ఏఐ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు.

READ MORE:LB NAGAR చట్నీస్‌ హోటల్‌లో పేలుడు – ముగ్గురుకి తీవ్ర గాయాలు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular