Monday, April 6, 2026
Chat on WhatsApp
HomeInterNationalIND VS PAK:మరోసారి ఉత్కంఠకు రంగం సిద్ధం 

IND VS PAK:మరోసారి ఉత్కంఠకు రంగం సిద్ధం 

-

Chat on WhatsApp

ఆసియా కప్‌ 2025లో మూడు సార్లు తలపడిన భారత్‌, పాకిస్తాన్‌ జట్లు మరోసారి క్రికెట్ అభిమానులను ఉత్కంఠకు గురి చేయడానికి సిద్ధమయ్యాయి. నవంబర్‌లో జరిగే హాంకాంగ్‌ సిక్సర్స్‌ టోర్నమెంట్‌ మరియు రైజింగ్‌ స్టార్స్‌ ఆసియా కప్‌లలో ఈ రెండు జట్లు నాలుగు సార్లు తలపడే అవకాశం ఉంది.

మొదటగా నవంబర్‌ 7న హాంకాంగ్‌లోని టిన్‌ క్వాంగ్‌ రోడ్‌ రిక్రియేషన్‌ గ్రౌండ్‌లో 6-ఓవర్ల ఫార్మాట్‌లో ఈ రెండు జట్లు తలపడతాయి. ఇది హాంకాంగ్‌ సిక్సర్స్‌ టోర్నీలో తొలి మ్యాచ్‌. ఈ టోర్నీలో నాకౌట్‌ దశకు చేరితే, భారత్‌, పాకిస్తాన్‌ మరోసారి ఎదురుపడే అవకాశం ఉంది. చిన్న ఫార్మాట్‌ కావడంతో ఫోర్లు, సిక్సర్లతో ప్రేక్షకులకు అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్‌ లభించనుంది.

తర్వాత నవంబర్‌ 14న ప్రారంభమయ్యే రైజింగ్‌ స్టార్స్‌ ఆసియా కప్‌లో నవంబర్‌ 16న ఈ రెండు జట్లు మళ్లీ తలపడతాయి. యువ ఆటగాళ్లకు వేదికగా నిలిచే ఈ టోర్నీలో భవిష్యత్‌ స్టార్‌ ప్లేయర్లు తమ ప్రతిభను చాటుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. సెమీఫైనల్స్‌ లేదా ఫైనల్స్‌లో మళ్లీ ఎదురుపడితే, ఈ టోర్నీలో కూడా రెండుసార్లు పోటీ పడే ఛాన్స్‌ ఉంటుంది.

దీంతో, నవంబర్‌ నెలలో భారత్‌, పాకిస్తాన్‌ మధ్య కనీసం రెండు సార్లు, గరిష్ఠంగా నాలుగు సార్లు తలపడే అవకాశం ఉంది. ఆసియా కప్‌లో జరిగిన హ్యాండ్‌షేక్‌ వివాదం తర్వాత, ఈ మ్యాచ్‌లపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. రాబోయే పోరులో ఉత్కంఠ, ప్రతిష్ట, రివెంజ్‌ అన్నీ ఒకేసారి ఉండబోతున్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

adivi sesh and mrunal thakur in dacoit movie trailer scene

Dacoit Movie | డెకాయిట్‌ మూవీ ట్రైలర్ విడుదల…అడివి శేష్, మృణాల్ కేమిస్ట్రీ హైలైట్

Dacoit Movie: అడివి శేష్‌ హీరోగా రాబోయే రొమాంటిక్ యాక్షన్ మూవీ ‘డెకాయిట్‌’ ట్రైలర్ విడుదల అయింది. ఈ చిత్రాన్ని షానీల్ డియో దర్శకత్వం వహించారు. హీరోగా అడివి శేష్‌, హీరోయిన్‌గా మృణాల్...
- Advertisement -
Chat on WhatsApp