Tuesday, March 31, 2026
Chat on WhatsApp
HomeSiddipetSiddipetపేద విద్యార్థిని వైద్య విద్యకు భరోసా: హరీష్ రావు దాతృత్వం

పేద విద్యార్థిని వైద్య విద్యకు భరోసా: హరీష్ రావు దాతృత్వం

-

Chat on WhatsApp

Siddipet: సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు మరో సారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు పేద విద్యార్థిని వైద్య విద్య కొనసాగింపుకు ఆర్థిక భరోసా కల్పించారు. మమత అనే విద్యార్థినికి పీజీ మెడికల్ ఎంట్రన్స్‌లో సీటు రావడంతో కళాశాల యాజమాన్యం ఏటా రూ.7.50 లక్షల ట్యూషన్ ఫీజు చెల్లించాలని తెలియజేసింది.

ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమె కుటుంబం బ్యాంకులో విద్యా రుణానికి దరఖాస్తు చేయగా, ఆస్తిని తాకట్టు పెట్టినప్పుడే లోన్ మంజూరు చేస్తామని బ్యాంకు సిబ్బంది తెలిపారు.

ALSO READ:Vladimir Putin Warning | యూరప్ నేతలపై పుతిన్ ఘాటు వ్యాఖ్యలు

ఈ విషయాన్ని విద్యార్థిని మమత, ఆమె తండ్రి రామచంద్రం హరీష్ రావు దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన హరీష్ రావు సిద్దిపేటలోని తన స్వగృహాన్ని బ్యాంకులో మార్టిగేజ్ చేసి రూ.20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు అయ్యేలా చర్యలు తీసుకున్నారు. అదనంగా విద్యార్థిని హాస్టల్ ఫీజుల కోసం రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందించారు.

ఈ సహకారంతో మమత పీజీ వైద్య విద్య కొనసాగించేందుకు మార్గం సుగమమైంది. స్థానికంగా ఈ ఘటనపై సానుకూల స్పందన వ్యక్తమవుతోంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

income tax return itr forms for ay 2026-27

Income Tax Return | ఐటీఆర్‌ ఫారాలు విడుదల.. ఎవరు ఏ ఫారం దాఖలు...

 Income Tax Retur: పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక సమాచారం ఇచ్చింది. 2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్‌) ఫారాలను ఆదాయపు పన్ను శాఖ నోటిఫై చేసింది.చిన్న, మధ్యతరహా...
- Advertisement -
Chat on WhatsApp