గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ చిత్ర ప్రమోషన్స్ వేగం పెంచాయి. జనవరి 10న విడుదల కానున్న ఈ సినిమా మేనియా ఇప్పటికే ప్రేక్షకులను ఊరించేస్తోంది. డిసెంబరు 29న, విజయవాడలోని వజ్రా గ్రౌండ్స్ వద్ద భారతదేశంలోనే అతి పెద్ద రామ్ చరణ్ కటౌట్‌ను ఆవిష్కరించనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి ఈ ఈవెంట్ జరగనుంది.
రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా రూపొందిన గేమ్ చేంజర్, ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కింది. సినిమా ప్రారంభం నుంచి ఈ ప్రాజెక్ట్ భారీ హైప్ క్రియేట్ చేసింది. తమన్ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. టీజర్ విడుదల తర్వాత ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
మేకర్స్ ఈ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ చాలా ఉన్నాయని, ప్రేక్షకులకు ఎలాంటి నిరాశ కలిగించకుండా పెద్ద హిట్ ఇచ్చే నమ్మకంతో ఉన్నారని వెల్లడించారు. శంకర్ గత సినిమాల ట్రాక్ రికార్డును చూస్తే గేమ్ చేంజర్ మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.
ఈ క్రమంలో, కటౌట్ ఆవిష్కరణ ఈవెంట్ ద్వారా రామ్ చరణ్ అభిమానులకు పండగ చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నది. ఈ గ్రాండ్ ప్రోగ్రామ్ గేమ్ చేంజర్ ప్రమోషన్స్ లో కీలక మైలురాయిగా నిలుస్తుంది.