నిజాంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తరగతుల్లో విద్యాబోధన చేశారు. ప్రధానోపాధ్యాయులుగా సింధు, డీఈవోగా నవదీప్ గౌడ్, ఎంఈఓగా సాత్విక్ బాధ్యతలు నిర్వహించారు.
ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయురాలు అరుణ మాట్లాడుతూ విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి విద్యాబోధన చేయడం సమాజంలో బాధ్యతను పెంపొందించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు, స్వయం నియంత్రణ పెరుగుతాయని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు చూపించిన నైపుణ్యం ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను ఎంతో ఆనందపరిచిందని తెలిపారు. ప్రాథమిక స్థాయిలోనే స్వయం పరిపాలనపై అవగాహన కలిగేలా ఇలాంటి కార్యక్రమాలు ముఖ్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వినోద్, శ్రీలత, రాజేందర్, శ్రీకాంత్ గౌడ్, శ్రీనివాస్, ఇంతియాజ్ భాను, బాల్ లక్ష్మి, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు మిలిన ఈ వేడుక విద్యా రంగానికి మంచి ప్రేరణగా నిలిచింది.