Gold Silver Prices Today: బంగారం, వెండి ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఇప్పటికే రూ.లక్షన్నర మార్క్‌ను దాటిన మేలిమి (24 క్యారెట్లు) బంగారం ధర మరోసారి భారీగా పెరిగింది.
బుధవారం ఉదయం 9.45 గంటల సమయంలో హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1.59 లక్షలకు చేరింది. క్రితం రోజు ధర రూ.1,52,800తో పోలిస్తే ఒక్కరోజే రూ.6,000కుపైగా పెరగడం విశేషం.
ఇక వెండి ధర కూడా అదే స్థాయిలో దూసుకెళ్తోంది. నేటి మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.3,19,200గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ విలువైన లోహాల ధరలు జోరుగా పెరుగుతున్నాయి.
ALSO READ:Jr NTR Dragon | డ్రాగన్’ షూటింగ్‌కు బ్రేక్.. జూనియర్ ఎన్టీఆర్‌కు స్వల్ప అనారోగ్యం
ఔన్సు వెండి ధర చరిత్రలో తొలిసారిగా 94 డాలర్ల స్థాయిని దాటగా, ఔన్సు బంగారం ధర 4,849 డాలర్లకు చేరింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ దేశాలు, ఫ్రాన్స్‌పై భారీ సుంకాలను ప్రకటించడం నేపథ్యంలో అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాలు పెరిగాయి. గ్రీన్‌లాండ్ స్వాధీనం, గాజా శాంతిమండలిలో సభ్యత్వానికి సహకారం లేదనే కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
ఈ పరిణామాల నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారం, వెండిని సురక్షిత పెట్టుబడులుగా భావించడంతో ధరలు గణనీయంగా పెరుగుతున్నాయని బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
మరోవైపు పునరుత్పాదక ఇంధన రంగాలు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో వెండికి పెరుగుతున్న వినియోగం కారణంగా డిమాండ్ మరింత పెరిగి ధరలు ఎగబాకుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.







