Saturday, April 4, 2026
Chat on WhatsApp
HomeTelanganaజిల్లాలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల ప్రారంభం

జిల్లాలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల ప్రారంభం

-

Chat on WhatsApp

జిల్లాలో క్యాన్సర్ అనుమానిత మహిళలకు హైదారాబాద్ లోని ప్రముఖ యం.ఎన్. జె క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి బుధవారం ఉదయం మున్సిపల్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, మున్సిపల్ చైర్మన్ పి మహేష్, సన చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకులు సురభి సత్తయ్య, సురభి నర్సమ్మ లతో కలిసి ప్రారంభోత్సవం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సన చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో యం.ఎన్.జె క్యాన్సర్ హాస్పిటల్ యాజమాన్యం కోట్ల రూపాయల విలువ చేసే మామోగ్రమి యంత్రాలను ఈరోజు జిల్లాకు తీసుకురావడం జరిగిందన్నారు.

మున్సిపల్ పారిశుధ్య మహిళా సిబ్బంది, ఇతర గ్రామాల్లోని క్యాన్సర్ అనుమానిత మహిళలను 102 వాహనం ద్వారా ఇక్కడికి తీసుకురావడం జరిగిందని అందరూ క్యాన్సర్ నిర్ధారణ వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమం ద్వారా మహిళలు క్యాన్సర్ నిర్ధారణకు చేరుకునే అవకాశం పొందారు. ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండడం, దీనితో మరింత ప్రజా అవగాహన పెరుగుతుంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

adivi sesh and mrunal thakur in dacoit movie trailer scene

Dacoit Movie | డెకాయిట్‌ మూవీ ట్రైలర్ విడుదల…అడివి శేష్, మృణాల్ కేమిస్ట్రీ హైలైట్

Dacoit Movie: అడివి శేష్‌ హీరోగా రాబోయే రొమాంటిక్ యాక్షన్ మూవీ ‘డెకాయిట్‌’ ట్రైలర్ విడుదల అయింది. ఈ చిత్రాన్ని షానీల్ డియో దర్శకత్వం వహించారు. హీరోగా అడివి శేష్‌, హీరోయిన్‌గా మృణాల్...
- Advertisement -
Chat on WhatsApp