పల్నాడు జిల్లా ట్రాన్స్ఫార్మర్‌లలో కాపర్ వైర్ దొంగతనాలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగల వద్ద నుంచి సుమారు ₹3,50,000 విలువైన కాపర్ వైర్‌ను రికవరీ చేశారు. పల్నాడు ఎస్పీ కంచి శ్రీనివాసరావు IPS ఆదేశాల మేరకు నరసరావుపేట డీఎస్పీ K. నాగేశ్వరరావు నేతృత్వంలో వినుకొండ రూరల్ సీఐ B. ప్రభాకర్, ఐనవోలు ఎస్‌ఐ B.V. కృష్ణారావు పోలీసులు ఈ దొంగతనాలను వెలికితీశారు.
ఈ కేసులో ఐనవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో Cr. No: 61/2024, 72/2024, 89/2024 & 116/2024 కింద 4 కేసులు నమోదు చేశారు. దొంగలు పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్‌లను పగులగొట్టి కాపర్ వైర్ దొంగిలిస్తూ ఇనుప కొట్లకు తక్కువ ధరకు అమ్ముతున్నారని గుర్తించారు.
ఇది కేవలం ఐనవోలు పరిధి వరకే పరిమితం కాకుండా పల్నాడు జిల్లాలోని శావల్యాపురం, బండ్లమోటు, వినుకొండ, నకరికల్లు, మాచర్ల వంటి ప్రాంతాల్లో, అలాగే ప్రకాశం జిల్లాలోని దొనకొండ, త్రిపురాంతకం, యర్రగొండపాలెం, పెద్దారవీడు ప్రాంతాల్లోనూ దొంగతనాలు జరిగినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల చర్యతో ఇలాంటి దొంగతనాలకు ఆపుదు ఏర్పడిందని గ్రామీణ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాపర్ వైర్ దొంగతనాలు వ్యవసాయ విద్యుత్ పంపిణీపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని రైతులు గతంలో పిర్యాదులు చేశారు.