ఆర్ ఎఫ్ సి ఎల్ ఫ్యాక్టరీ మురుగు నీటి కాలువకు ప్రతికూల ప్రభావాలు

Concerns were raised about chemical waste from the RFCL factory impacting local drainage. Leaders urge for measures to control pollution and improve community welfare. Concerns were raised about chemical waste from the RFCL factory impacting local drainage. Leaders urge for measures to control pollution and improve community welfare.

జనావాసాల మీదుగా ప్రవహిస్తున్న మురుగు నీటి కాలువలోకి ఆర్ ఎఫ్ సి ఎల్ ఫ్యాక్టరీ నుండి వెలువడుతున్న విష రసాయన వ్యర్ధాలు వదలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శరవణన్ కలిసి రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ , కార్పొరేటర్లు మహంకాళి స్వామి , బొంతల రాజేష్ , ముస్తఫా తదితర నాయకులు కోరారు. బుధవారం ఆర్ ఎఫ్ సి ఎల్ ఫ్యాక్టరీ సందర్శనకు విచ్చేసిన ఆయనను రామగుండం ఎం ఎల్ ఎ ఆదేశాల మేరకు కలిసి వినతి పత్రం సమర్పించారు. . ఆర్ ఎఫ్ సి ఎల్ కారణంగా వాయు , జల , శబ్ద కాలుష్యంతో బాధపడుతున్న వీర్లపల్లి కి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని కోరారు. స్థానికులకే ఫ్యాక్టరీ లో ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. సామాజిక భాద్యతగా ప్రభావిత ప్రాంతాల అభివృద్దికి నిధులు కేటాయించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *