పార్వతీపురం జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామిక మహిళామణులు కావాలని, ఆ దిశగా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నూతన యూనిట్లను స్థాపించి వారి జీవన ప్రమాణాలు మెరుగుపడాలని పేర్కొన్నారు. జిల్లాలో జీవనోపాదుల కార్యక్రమాలపై సంబంధిత శాఖల అధికారులతో బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో జిల్లా కలెక్టర్ సమీక్షించారు.
పారిశ్రామిక మహిళామణుల ప్రోత్సాహం పై కలెక్టర్ సమీక్ష
