కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని రాశి వనంలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛతా హి సేవలో భాగంగా కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో గల వివిధ విద్యాసంస్థల పిల్లలకు వ్యాసరచన చిత్రలేఖనం పోటీ లు నిర్వహించడం జరిగింది, అందులో గెలుపొందిన వారికి మొదటి బహుమతి రెండో బహుమతి, ఇవ్వడం జరిగింది,ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ ఇందుప్రియ మాట్లాడారు పోటీలో విద్యార్థులు సర్టిఫికెట్స్ , మెమొంటోస్ రాలేవని బాధపడవద్దని , కష్టపడితే ఇలాంటి సర్టిఫికెట్స్ మెమొంటోస్ ఎన్నో వస్తాయని అన్నారు.పిల్లల పట్ల శ్రద్ధ చూపుతున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో, మున్సిపల్ కమిషనర్ సుజాత, ఉపాధ్యాయులు విద్యార్థులు,సానిటరీ ఎస్సై పర్వేజ్, మోమిన్, తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి మున్సిపల్ పరిధిలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమం
