The Madiga Reservation Struggle Committee protested, demanding a halt to job recruitments until the SC classification is implemented following a Supreme Court ruling.

ఎస్సీ వర్గీకరణ అమలుకు నిరసన ప్రదర్శన

ఎస్సీ వర్గీకరణ అమలులోకి వచ్చేంతవరకు ఉద్యోగ నియామకాలు నిలిపివేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. పోయిన ఆగస్టు నెలలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణను అమలు చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని చారిత్రాత్మక తీర్పు ఇచ్చిందని అన్నారు. గంటలోపే అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు. ఇప్పటికీ రెండు నెలలు దాటిన ఎస్సీ వర్గీకరణను అమలులోకి తీసుకు రాలేదని దీనివలన మాదిగ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని,…

Read More
During the Sharannavaratrulu festivities, devotees in Nirmal presented Bonalu to Durga Mata with traditional music, dance, and offerings, expressing their joy and gratitude for her blessings.

నిర్మల్‌లో దుర్గామాతకు బోనాల సమర్పణ

శరన్నవరాత్రుల్లో భాగంగా నిర్మల్ దక్షిణ శాస్త్రి నగర్ దుర్గామాత అమ్మవారికి మేళ తాళాలతో, డప్పుల చప్పులతో, నృత్యాలతో దుర్గామాతకు బోనాలు సమర్పించారు. ఈరోజు మహాలక్ష్మి అమ్మవారి రూపంలో దర్శనమిస్తుందని ఆ అమ్మవారు తమ కుటుంబాలను , పిల్లలను చల్లగా చూడాలని విద్యాబుద్ధులు బాగా రావాలని అమ్మవారి చూపులు మా అందరి పై ఉండాలని ప్రతి సంవత్సరము ఇలాగే బోనాలు సమర్పించుకుంటామని ఇది మాకెంతో సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమానంతరం భోజనాలు కూడా ఏర్పాటు చేశారు.

Read More
At the Basara Gnana Saraswati temple, devotees celebrate the fifth day of Sharannavaratri by worshipping Goddess Skandamata, highlighting rituals, free food services, and facilities for pilgrims.

బాసరలో అమ్మవారి “స్కందమాతా” అవతారం

నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్స‌వాలలో 5వ రోజు అమ్మవారు “స్కందమాతా” అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. “”సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా శుభమస్తు సదా దేవి స్కందమాతా యశస్వినీ”” అంటూ అమ్మవారిని ఆరాధించడం ద్వారా ఆత్మవిశ్వాసంతో పాటు జ్ఞానం శక్తి సుఖశాంతులు లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆలయ వైదిక బృందం అమ్మవారికి విశేష అర్చన పూజలను నిర్వహించి పెరుగు అన్నం ను నైవేద్యం గా నివేదించారు.వేకువ జామునే భక్తులు పవిత్ర…

Read More
During the Devi Sharannavarathri festival, the Hanuman Temple in Shastri Nagar adorned Goddess Lalitha Parameshwari with colorful decorations, and women conducted Kumkumarchana rituals, praying for the well-being of their families.

లలిత పరమేశ్వరి రూపంలో అమ్మవారి అలంకరణ

దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శాస్త్రి నగర్ హనుమాన్ ఆలయంలో ఏర్పాటుచేసిన అమ్మవారిని లలిత పరమేశ్వరి రూపంలో అలంకరించారు . అమ్మవారికి రంగురంగుల గాజులతో అలంకరించి మహిళలందరూ కలిసి కుంకుమార్చన పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారు తమ పిల్లలను కుటుంబాలను సుఖసంతోషాలతో పసుపు కుంకుమలతో ఆయురారోగ్యాలతో చల్లగా చూడాలని వేడుకున్నారు. ఈ పూజ కార్యక్రమాన్ని అనురాగ్ శర్మ నిర్వహించారు.

Read More
The State SC ST Commission Chairman held a review meeting with officials to expedite the resolution of SC and ST atrocity cases and ensure justice for victims.

అట్రాసిటీ కేసులపై సమీక్షా సమావేశం

రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల తో కలిసి అట్రాసిటీ కేసులు వివిధ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని అలాగే జిల్లాలో వివిధ శాఖల ద్వారా ఎస్సీ ఎస్టీలకు అందుతున్న అభివృద్ధి ఫలాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి…

Read More
Nirmal District Collector Abhilash Abhinav honored Mahatma Gandhi on his birth anniversary, urging all to follow his peaceful and moral path.

గాంధీ మార్గంలో నడవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ పిలుపు

జాతిపిత మహాత్మా గాంధీ చూపిన బాటలో మనమంతా నడవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్ ,కిషోర్ కుమార్ లతో కలిసి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. స్వాతంత్ర సంగ్రామంలో శాంతియుత మార్గంలో…

Read More
Vagdevi School in Tanur hosted colorful Bathukamma festivities, where students decorated vibrant floral arrangements and celebrated with traditional songs and dances.

తానూర్ వాగ్దేవి పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహణ

నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని వాగ్దేవి పాఠశాలలో సోమవారం బతుకమ్మ పండుగను ముందస్తు వేడుకలుగా ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు రంగురంగుల పూలతో అందమైన బతుకమ్మలను పేర్చి సాంప్రదాయ పద్ధతిలో పండుగను జరుపుకున్నారు. ప్రిన్సిపాల్ అరవింద్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు. ఆయన ఈ సందర్భంగా విద్యార్థులకు బతుకమ్మ పండుగ వైభవం, దాని ప్రాముఖ్యత గురించి వివరించారు. పూలతో కూడిన ఈ పండుగలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థినులు బతుకమ్మ పాటలు పాడుతూ, బతుకమ్మ…

Read More