శ్రీకాకుళంలో మెడికల్ మాఫియా పెరుగుతోంది – ఏఐవైఎఫ్ ఆందోళన
శ్రీకాకుళం జిల్లాలో మెడికల్ మాఫియా పెరిగిపోతుందని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మొజ్జాడ యుగంధర్, జిల్లా నాయకులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాసరావులు ఆరోపించారు. నరసన్నపేటలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో వారు మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఆర్‌ఎంపీ నుంచి ఎండి డాక్టర్ల వరకు అధిక ఫీజులు, అవాంఛిత స్కానింగ్‌లు, టెస్టుల పేరుతో ప్రజలను దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. ప్రైవేట్ హాస్పిటళ్లలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలను ఉల్లంఘిస్తూ నోటీసు బోర్డులు పెట్టకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నప్పటికీ,…
