జనసేన ఆవిర్భావ దినోత్సవానికి హిందూపురం నుంచి భారీ ర్యాలీ
జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ నెల 14న పిఠాపురం, చిత్రాడలో భారీ బహిరంగ సభగా నిర్వహించనున్నారు. ఈ సభ విజయవంతం చేయడానికి హిందూపురం పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు, వీర మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సభ విజయవంతం చేయడానికి ప్రత్యేకంగా బస్సులు, జీపులు, ఇతర వాహనాలను ఏర్పాటు చేశామని…
