నర్సీపట్నం బలిఘట్టం ఏర్పాట్లు పరిశీలించిన స్పీకర్
మహాశివరాత్రి సందర్భంగా నర్సీపట్నం బలిఘట్టం స్నాన ఘట్టాలను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సందర్శించారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో, వారి సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. పట్టణ సీఐ గోవిందరావుకు పోలీస్ బందోబస్తును పకడ్బందిగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా స్పీకర్ మీడియాతో మాట్లాడుతూ, మహాశివరాత్రి హిందువులకు అత్యంత పవిత్రమైన పర్వదినమని తెలిపారు. నర్సీపట్నం ఉత్తర వాహినిని “దక్షిణ కాశీ”గా పిలుస్తారని, పూర్వం నుండి భక్తులు…
