Wednesday, July 8, 2026
Chat on WhatsApp
HomeNationalభార్య వేధింపులు తట్టుకోలేక ఢిల్లీలో కేఫ్ యజమాని ఆత్మహత్య

భార్య వేధింపులు తట్టుకోలేక ఢిల్లీలో కేఫ్ యజమాని ఆత్మహత్య

-

Chat on WhatsApp

బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య ఘటన మరవకముందే, ఢిల్లీలో మరో సంఘటన చోటు చేసుకుంది. కేఫ్ యజమాని పునీత్ ఖురానా (40) తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. భార్య మానిక పహ్వా నుంచి విడాకులు తీసుకుంటున్నా, ఆమె తనను విడిచిపెట్టలేదని, రోజూ చిత్రహింసలకు గురిచేస్తోందని, తన జీవితం నరకంగా మారిందని చెప్పాడు.

ఆత్మహత్యకు ముందు పునీత్ సెల్ఫీ వీడియో తీసుకుని తన బాధలను వ్యక్తం చేశాడు. కోర్టు ముందు విడాకులకు సంబంధిత పత్రాలపై సంతకాలు చేసినా, ఆమె ఇంకా తనపై ఆర్థిక డిమాండ్లు పెడుతోందని, రూ. 10 లక్షలు అడుగుతోందని ఆరోపించాడు. కోర్టు ఇచ్చిన 180 రోజుల గడువులో 90 రోజులు పూర్తయినా, ఆమె వేధింపులు ఆగలేదని తన వీడియోలో వివరించాడు.

పునీత్ ఆత్మహత్యకు భార్య మానిక పహ్వా, ఆమె కుటుంబసభ్యులే కారణమని, వారు అతడిని ఆర్థికంగా, భావోద్వేగపరంగా చిత్రహింసలకు గురిచేశారని పునీత్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. తన కుమారుడు మౌనంగా ఈ హింసను భరించాడని, ఆ విషయం తమకు ఎప్పుడూ చెప్పలేదని తెలిపారు.

పునీత్ ఆత్మహత్యకు సంబంధించిన 59 నిమిషాల వీడియోలో తన ఎదుర్కొన్న అన్ని హింసలను పునీత్ వివరించినట్టు తెలుస్తోంది. పునీత్ కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Nothing Phone 4b

Nothing Phone 4b లాంచ్.. 6000mAh బ్యాటరీతో కొత్త 5G ఫోన్

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన ప్రత్యేక డిజైన్‌తో గుర్తింపు పొందిన Nothing సంస్థ మరో కొత్త డివైస్‌ను పరిచయం చేసింది. కంపెనీ చరిత్రలో తొలిసారిగా 'B' సిరీస్‌లో భాగంగా Nothing Phone 4bను విడుదల...
- Advertisement -
Chat on WhatsApp