Sunday, April 5, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshBill Gates in AP | ఏపీ సీఎం చంద్రబాబుతో బిల్ గేట్స్ భేటీ..  కీలక...

Bill Gates in AP | ఏపీ సీఎం చంద్రబాబుతో బిల్ గేట్స్ భేటీ..  కీలక రంగాలపై ఫోకస్

-

Chat on WhatsApp

Bill Gates in AP: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తో గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్(Bill Gates) భేటీ అయ్యారు.ఈరోజు ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న బిల్ గేట్స్ అక్కడి నుంచి నేరుగా అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు.

సచివాలయం వద్ద సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారాలోకేష్ (Nara Lokesh) సహా పలువురు మంత్రులు బిల్ గేట్స్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం చంద్రబాబు, బిల్ గేట్స్ బృందంతో కలిసి కీలక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ (RTGS)ను బిల్ గేట్స్ సందర్శించనున్నారు. ఆర్టీజీఎస్‌ ద్వారా అమలవుతున్న విధానాలు, పాలనలో పారదర్శకత, ప్రజలకు అందుతున్న సేవల ఫలితాలను సీఎం చంద్రబాబు గేట్స్‌కు వివరించనున్నారు.

అలాగే గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయం రంగాల్లో అమలవుతున్న పలు ప్రాజెక్టులను మరింత విస్తరించడంపై కీలక చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో కొనసాగుతున్న ‘సంజీవని’ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు బిల్ గేట్స్‌కు ప్రత్యేకంగా వివరించనున్నట్లు సమాచారం.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

adivi sesh and mrunal thakur in dacoit movie trailer scene

Dacoit Movie | డెకాయిట్‌ మూవీ ట్రైలర్ విడుదల…అడివి శేష్, మృణాల్ కేమిస్ట్రీ హైలైట్

Dacoit Movie: అడివి శేష్‌ హీరోగా రాబోయే రొమాంటిక్ యాక్షన్ మూవీ ‘డెకాయిట్‌’ ట్రైలర్ విడుదల అయింది. ఈ చిత్రాన్ని షానీల్ డియో దర్శకత్వం వహించారు. హీరోగా అడివి శేష్‌, హీరోయిన్‌గా మృణాల్...
- Advertisement -
Chat on WhatsApp