Arshdeep Singh: భారత నంబర్ వన్ టీ20 బౌలర్ “అర్షదీప్ సింగ్“(Arshdeep Singh)పై ICC కఠిన చర్యలు తీసుకుంది. టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్ బ్యాటర్ “డారిల్ మిచెల్” పై ప్రమాదకరంగా బంతి విసరినందుకు 15% మ్యాచ్ ఫీజ్ కోత మరియు 1 డీమెరిట్ పాయింట్ జారీ చేసింది. గత 24 నెలల్లో ఇదే అతని మొదటి తప్పిదం కావడంతో నిషేధం తప్పించుకున్నాడు.
ఫైనల్‌లో అర్షదీప్ ఫాలో-అప్ బంతిని వికెట్‌ల వైపు విసరగా, ప్రమాదవశాత్తు మిచెల్‌ను తాకడం ఘటించింది. అర్శదీప్ తర్వాత కూడా మిచెల్‌పై తన ఫోకస్ కొనసాగించాడు. సూర్యకుమార్ యాదవ్ చొరవతో, ఘర్షణ ముగిసింది.
ICC కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.9 ప్రకారం, ఇతర ఆటగాడి వైపు బంతి విసరడం నిషిద్ధం. ఈ ఫైనల్‌లో భారత్ 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి “మూడో టీ20 ప్రపంచకప్ (2007, 2024, 2026)ను సాధించుకుంది.






