Amaravati Banking Street Launch: అమరావతిని ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. అమరావతిలో 15 ప్రముఖ బ్యాంకులు మరియు బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి పునాది వేయడం ద్వారా రాజధాని నగర ఆర్థిక వేగం మరింత పెరగనుంది.
నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా పలువురు మంత్రులు హాజరయ్యారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పునర్నిర్మాణానికి అందిస్తున్న సహకారం ఎంతో కీలకమని పేర్కొన్నారు. అమరావతికి ఆర్థిక రంగంలో బలమైన పునాది వేయడానికి ఈ ప్రాజెక్ట్ తోడ్పడుతుందని చెప్పారు.
బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీబీఐ, ఎల్ఐసీ వంటి 15 సంస్థలు ఒకే చోట కార్యకలాపాలు ప్రారంభించడం అరుదైన అవకాశమని తెలిపారు.
ALSO READ:Imran Khan alive news | ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగా ఉన్నారని పాక్ అధికారిక ప్రకటన
కొత్త బ్యాంకింగ్ స్ట్రీట్ ద్వారా రూ.1,328 కోట్ల పెట్టుబడులు ఆకర్షించబడతాయని, సుమారు 6,500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. అమరావతికి భూములు ఇచ్చిన రైతుల నమ్మకమే ఈ ప్రాజెక్ట్‌కు పునాది అని పవన్ కళ్యాణ్ అన్నారు.
కేంద్రం సహకారంతో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన గుర్తుచేశారు. పోలవరానికి రూ.12,500 కోట్లు, అమరావతి నిర్మాణానికి రూ.15,000 కోట్లు, విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు ఆర్థిక సహాయం వంటి ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తున్నాయని చెప్పారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి చూపుతున్న ప్రత్యేక ఆసక్తి అభివృద్ధి వేగాన్ని పెంచుతుందని వ్యాఖ్యానించారు.
