Wednesday, July 8, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshఏలూరులో యానిమల్ హస్బండ్రీ అసోసియేషన్ ఎన్నికల సఫలత

ఏలూరులో యానిమల్ హస్బండ్రీ అసోసియేషన్ ఎన్నికల సఫలత

-

Chat on WhatsApp

ఏలూరు నగరంలో యానిమల్ హస్బండ్రీ అసిస్టెంట్ సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా చైర్మన్ ఎం గణేష్ ఎలక్షన్ అధికారిగా వ్యవహరించారు. ఎన్నికల్లో అసోసియేషన్ ప్రెసిడెంట్ గా తమరిష్ గాంధీ, సెక్రటరీగా బిరుదు గడ్డ రాజేష్, కోశాధికారిగా డోలా అశోక్ కుమార్, ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎలక్షన్ అధికారి ఎం గణేష్ తెలిపారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ అసోసియేషన్ ఎన్నికలు సజావుగా జరిగాయని కొత్తగా ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని అభినందించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అందరూ ఐక్యమత్యంతో పనిచేసి యూనియన్ సమస్యల పట్ల స్పందించి సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Nothing Phone 4b

Nothing Phone 4b లాంచ్.. 6000mAh బ్యాటరీతో కొత్త 5G ఫోన్

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన ప్రత్యేక డిజైన్‌తో గుర్తింపు పొందిన Nothing సంస్థ మరో కొత్త డివైస్‌ను పరిచయం చేసింది. కంపెనీ చరిత్రలో తొలిసారిగా 'B' సిరీస్‌లో భాగంగా Nothing Phone 4bను విడుదల...
- Advertisement -
Chat on WhatsApp