రామగుండం లోని ఎమ్మార్వో ఆఫీస్ లో గౌరవనీయులైనటువంటి అడిషనల్ డిస్టిక్ కలెక్టర్ మరియు లోకల్ బాడీ అరుణ శ్రీ గారి కి ఎన్టిపిసి లో ఉన్నటువంటి వార్డులలో చెత్త మరియు మురికి కాలువలు ఇంకా స్ట్రీట్ లైట్స్ కొరకు తమ వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఎన్టిపిసి లో ఉన్నటువంటి ముఖ్యమైన ఎన్టిపిసి మార్కెట్ ఘాట్, మేడిపల్లి చెరువు ఘాట్ , జంగాలపల్లి బ్రిడ్జి ఘాట్, న్యూ పరేడ్పల్లి బ్రిడ్జి ఘాట్ చెత్త క్లీ చేసి మరియు ఎల్ఈడి లైటింగ్స్ పెట్టించమని కోరారు. ఇందులో కాంగ్రెస్ యూత్ జనరల్ సెక్రెటరీ ముచ్చ కూర్తి రమేష్, నాలుగో వార్డ్ అధ్యక్షులు భరత్ గౌడ్ గారు , ఎన్టిపిసి టౌన్ జనరల్ సెక్రెటరీ మెరుగు లింగమూర్తి గారు, మరియు యూత్ కాంగ్రెస్ సభ్యులు జులా అవినాష్, జై కృష్ణ , వాసు తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీపీసీ వార్డుల అభివృద్ధి కోసం అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం
