గంగవరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కుంజం సిద్దు ఆధ్వర్యంలో మండలానికి కొత్తగా వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ ని జనసేన నాయకు లు మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. మండలంలో శాంతిభద్రతల విషయంలో ఎటువంటి రాజీ పడకుండా అందరికీ అందుబాటులో పోలీస్ శాఖ ద్వారా తగిన సహాయ సహకారాలు అందిస్తానని ఏమయినా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురావాలని ఎస్సై గారు జనసేన నాయకులతో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఉపాధ్యక్షులు గవారాజు, వెంకన్న దొర, రాజు, రాజుకుమార్ తదితరులు పాల్గొన్నారు.
కొత్త SI తో జనసేన పార్టీ నేతలు సమావేశం
