పార్వతీపురం మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి అక్రమాలపై దర్యాప్తునకు ఆదేశించినట్లు ఎమ్మెల్యే విజయ చంద్ర తెలిపారు. గురువారం ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలకు విజయదశమి నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం మాట్లాడుతూ టౌన్ ప్లానింగ్ అధికారి అక్రమాలపై తీవ్ర ఆరోపణ వచ్చాయన్నారు . పట్నంలో చాలామంది వద్ద డబ్బులు తీసుకున్నట్లు నిబంధనలు విరుద్ధంగా అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయన్నారు. అధికారి వల్ల ఎవరెవరు ఇబ్బంది పడ్డారు వారంతా ముందుకొచ్చి తెలియజేస్తే తగు న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే కోరారు. పట్టణ ప్రణాళిక విభాగం అధికారి వల్ల ఏ విధమైన నష్టం జరిగినా అన్యాయానికి గురైన స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తన దృష్టికి తీసుకురావాలని అటువంటి బాధితులకు తగు న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి అక్రమాలపై దర్యాప్తు
