Wednesday, July 22, 2026
Chat on WhatsApp
HomeNationalNEET | మా సమయాన్ని వృథా చేయకండి, మీ సమయాన్ని కూడా వృథా చేసుకోకండి: సుప్రీంకోర్టు...

NEET | మా సమయాన్ని వృథా చేయకండి, మీ సమయాన్ని కూడా వృథా చేసుకోకండి: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

-

Chat on WhatsApp

NEET: నీట్ అవకతవకలపై విద్యార్థుల నిరసనలకు సంబంధించి పోలీసులు వ్యవహరించిన తీరును న్యాయవ్యవస్థ పరిశీలించే ఉద్దేశం లేదని సీజేఐ వెల్లడించారు. లా అండ్ ఆర్డర్‌కు సంబంధించిన నిర్ణయాల్లో న్యాయవ్యవస్థ ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడం సముచితం కాదని సీజేఐ స్పష్టం చేశారు. సీజేపీ నిర్వహించిన “చలో సంసద్” కార్యక్రమంలో పాల్గొన్న నిరసనకారులపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జ్ చేశారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరగా, సుప్రీంకోర్టు అందుకు నిరాకరించింది.

ఈ సందర్భంగా కేసును ప్రస్తావించిన న్యాయవాదితో సీజేఐ సూర్యకాంత్ మాట్లాడుతూ, “మా సమయాన్ని వృథా చేయకండి, మీ సమయాన్ని కూడా వృథా చేసుకోకండి” అని వ్యాఖ్యానించారు. నిరసనకారులపై పోలీసులు దాడి చేసిన వీడియోలు ఉన్నాయని న్యాయవాది పేర్కొనగా, వాటిని పరిశీలించే ఆసక్తి తమకు లేదని, అలాంటి అంశాల కోసం కోర్టు సమయాన్ని వినియోగించలేమని సీజేఐ స్పష్టం చేశారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp